చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

by Gantepaka Srikanth |
చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్​సీఈవో శివశంకర్ లోటేటి తెలంగాణ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్​ప్రతినిధులో చర్చలు జరిపారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1130 కోట్లు చెల్లించామని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని రూ.672 కోట్లు బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామన్నారు. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లను రివైజ్​చేశామని ఆయన తెలిపారు.

ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం ప్రభుత్వం పెంచిందని వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులను ఇబ్బందులకు గురిచేయవద్దని, వైద్య సేవలను నిలిపివేయకుండా యథావిధిగా సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్​బంద్​చేయాలనే ఆలోచనను విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed