CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు

by M.Rajitha |   ( Updated:2025-01-09 17:04:29.0  )
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆస్ట్రేలియా(Austrelia) పర్యటన రద్దయింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 14 నుంచి 23 వరకు గల షెడ్యూల్ లో.. ఈనెల 14న ఢిల్లీ(Delhi) వెళ్లనున్న సీఎం.. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం 17న సింగపూర్(Singapoor) వెళ్లనున్నారు. రెండు రోజుల సింగపూర్ పర్యటన అనంతరం 19న స్విట్జర్లాండ్ లోని దావోస్(Davos) కు పయనం కానున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(WEF)లో పాల్గొని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో సీఎం రేవంత్ రెడ్డి 14 వ తేదీన ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. అయితే సమయాభావం వల్ల పర్యటన రద్దయినట్టు అధికారులు చెబుతున్నా.. ప్రధాన కారణం మాత్రం తెలియరాలేదు.

Advertisement

Next Story