- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
seethakka: కాంట్రాక్టర్లు, అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం జరగాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పనుల నాణ్యతపై రాజీ పడొద్దని సూచించారు. బుధవారం ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమీక్షనిర్వహించారు. పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ఈఎన్సీ కనక రత్నం, చీఫ్ ఇంజనీర్లు, సీఈలు, ఈఈలు తదితరలు హాజరైన ఈ సమీక్షలో సీతక్క మాట్లాడుతూ.. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను (Contractors) బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారుల (Engineers)పై చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లో రహదారులు మెరవాలని ఈ బాధ్యత రూరల్ ఇంజనీరింగ్ విభాగానిదేనన్నారు.
ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుండివాగు (Gundivagu) బ్రిడ్జి 10 ఎండ్లుగా పూర్తికాలేదని దీనివల్ల 40 మంది ప్రజలు వాగు దాటలేక మృత్యువాత పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నా నియోజకవర్గంలో సరైన గ్రామీణ రోడ్లు లేక ఎంతో మంది ఆత్మీయులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయానన్నారు. పట్టణాల్లో ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు ఉన్నాయి. కానీ చాలా గ్రామాల్లో కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరం అన్నారు. జిల్లా స్థాయిలో రూరల్ ఇంజనీర్లు ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహించాలని, పనుల పురోగతి నివేదికలను ప్రతి 15 రోజులకు నివేదించాలని ఆదేశించారు. రూరల్ ఇంజనీర్లు తమ పనితనాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. సమాజం బాగుండాలంటే ఇంజనీర్ల పాత్ర గొప్పదని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.