Protein powders: మార్కెట్లో నకిలీ ప్రోటీన్ పౌడర్లు.. కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి?

by Anjali |
Protein powders: మార్కెట్లో నకిలీ ప్రోటీన్ పౌడర్లు.. కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రోటీన్ పౌడర్ల(protein powders) ఉపయోగాలు అనేకం. ప్రోటీన్ పౌడర్ వివిధ పోషకాలు(Nutrients), ఖనిజాలు(Minerals), విటమిన్లు(Vitamins)తో నిండి ఉంటుంది. ఇది పోషక లోపాన్ని నివారించడంలో మేలు చేస్తుంది. కండరాల నిర్మాణానికి(muscle building), వెయిట్ తగ్గడానికి.. అలాగే శక్తి స్థాయిల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శక్తివంతమైన కండరాల నిర్మాణాన్ని (toned muscles) నిర్వహిస్తుంది. అయితే ప్రోటీన్ పౌడర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. కాగా కొనేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.

మార్కెట్‌లోకి నకిలీ ఉత్పత్తులు వస్తున్నాయని.. కాగా వాటిని ఈ విధంగా గుర్తించండని నిపుణులు చెబుతున్నారు. నకిలీ ప్రొడక్స్ బాగా తెలిసిన బ్రాండ్ ను కాపీ చేస్తాయని.. అలాగే నేమ్‌లో పలు చిన్న చిన్న మార్పులు చేస్తారని చెబుతున్నారు. కాగా ప్రోటీన్ సప్లిమెంట్లను కొనేటప్పుడు లేబుల్‌(label)లను, ప్యాకేజింగ్ డిజైన్‌(Packaging design)ను గుర్తించండి. కొన్నిసార్లు నకిలీ వాటిలో డేట్ కూడా తప్పుగా ఉంటుంది. కాగా ఉత్పత్తి ముద్ర హోల్‌గ్రామ్‌ను తప్పక చూడాలి.

అలాగే నకిలీ ప్రోటీన్ సప్లిమెంట్లు టేస్టీగా ఉండేందుకు షుగర్‌ను ఎక్కువగా వాడుతారు. కాగా నిజమైన ప్రోటీన్ పౌడర్ కన్నా నకిలీది తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. సువాసను పెంచే సమ్మేళనాల్ని అధికంగా కలుపుతారు. కాగా స్మెల్ ను పసిగట్టండి. ఒకవేళ ప్రోటీన్ పౌడర్ కొన్నాక నిజమైనా లేదా అని సందేహం వస్తే కనుక ఆరోగ్య నిపుణుల్ని సంప్రదించవచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed