Kasturi : నన్ను అరెస్టు చేస్తారేమో..?: నటి కస్తూరి

by Y. Venkata Narasimha Reddy |
Kasturi : నన్ను అరెస్టు చేస్తారేమో..?: నటి కస్తూరి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసులు(Telangana Police) నన్ను ఈ వారాంతంలో అరెస్టు(Arrest) చేయవచ్చంటూ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి(Actress Kasturi) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ వారంతంలో నన్ను తెలంగాణ పోలీసు(Telangana Police)లు కుట్రపూరితంగా అరెస్టు చేయబోతున్నట్టు పుకార్లు వినవస్తున్నాయన్న కస్తూరి, అరెస్టు టైమింగ్ చాల ఆసక్తికరంగా ఉందని పేర్కొంది. ఎందుకంటే సంక్రాంతి కారణంగా.. కోర్టులకు రెండు వారాల పాటు సెలవులని..అప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉండదని, కొంతకాలం రిమాండ్ తప్పదన్నట్లుగా కస్తూరి ట్వీట్ చేశారు. ఈ అవమానకర సమాచారం నిజం కాదని తాను సిన్సీయర్ గా భావిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు.

తెలంగాణలో అల్లు అర్జున్ సహా ప్రతిపక్ష నేతల అరెస్టులు జరిగిన సమయంపై కస్తూరి ఈ సెటైరికల్ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ ను కూడా అలాగే అరెస్టు చేయవచ్చన్న సందేహాం కూడా ఈ ట్వీట్ వెనుక దాగి ఉందంటున్నారు.

కస్తూరి ఇటీవల తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చైన్నై పోలీసులచే అరెస్టు కాబడి రిమాండ్ చేయబడ్డారు. ఆ కేసులో ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉన్నారు. తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కస్తూరి క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాగా ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా కస్తూరి జైలులో తన అనుభవాలను పలు చానెళ్లతో పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed