- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను పూర్తి చేయాలి.. కలెక్టర్ ఆదర్శ్ సురభి
దిశ, వనపర్తి : అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను పూర్తి చేసి, ఉగాది పండుగ లోవు ప్రభుత్వానికి అప్పజెప్పాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్తకోట మండలం పామాపురం గ్రామం, పెబ్బేరు మండలం పాత పల్లె గ్రామాల్లో పర్యటించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు.
బేస్మెంట్, రూఫ్ లెవెల్ లెవల్ నిలిచిపోయిన నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీరు మల్లయ్యను కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం పనులను నాణ్యతతో పూర్తి చేసి ఉగాది పండుగలోపు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీరు మల్లయ్య, పెబ్బేరు తహశీల్దార్ లక్ష్మి, ఎంపీఓ రోజా, కాంట్రాక్టరు షణ్ముఖి, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.