రోడ్డు ప్రమాదాల్లో 1.80 లక్షల మంది మృతి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

by Mahesh |   ( Updated:2025-01-08 15:11:48.0  )
రోడ్డు ప్రమాదాల్లో 1.80 లక్షల మంది మృతి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, వెబ్ డెస్క్: 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 31 వరకు దేశంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో(road accidents) దాదాపు 1.80 లక్షల మరణాలు(deaths) సంభవించాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Minister Nitin Gadkari) తెలిపారు. న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో రోడ్డు భద్రతపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2024 లో రోడ్డు ప్రమాదాల్లో 1.80 లక్షల మంది మృతి చెందినట్లు తెలిపారు. వీరిలో హెల్మెట్(Helmet) ధరించకపోవడం వల్ల దాదాపు 30 వేల మంది చనిపోయారు అని, మొత్తం మరణాల్లో 66 శాతం మరణాలు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. పాఠశాలలు, కళాశాలల ముందు ఎగ్జిట్-ఎంట్రీ పాయింట్ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల సుమారు 10,000 మంది పిల్లలు మరణించారని ఈ సమావేశంలో గడ్కరీ తెలిపారు.

Read More ...

Gadkari : రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కొత్త పథకం : గడ్కరీ


Advertisement

Next Story

Most Viewed