Adivi Sesh: ‘G-2’ మిషన్‌లో బ్రిలియంట్ బ్యూటీ.. పోస్టర్‌తో హైప్ పెంచిన అడివిశేష్

by Hamsa |
Adivi Sesh: ‘G-2’ మిషన్‌లో బ్రిలియంట్ బ్యూటీ.. పోస్టర్‌తో హైప్ పెంచిన అడివిశేష్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి(Wamika Gabbi) ఇటీవల ‘బేబీ జాన్’(Baby John) సినిమాలో నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న గూడఛారి-2(Goodachari-2)లో వామికా భాగం అయింది. ఈఫాంఛైజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గూడఛారి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనుంది. అయితే దీనిని విజయ్ కుమార్(Vijay Kumar) సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను పిపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory), అభిషేక్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి శ్రీచరణ్(Sricharan) పాకాల సంగీతం అందిస్తున్నారు.

అయితే ‘గూడఛారి-2’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్(First Look) క్యూరియాసిటీని పెంచిన విషయం తెలిసిందే. తాజాగా, మూవీ మేకర్స్ ‘గూడఛారి-2’ మిషన్‌లో వామికా గబ్బి జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సూట్ ఉన్న వామికా, అడివి శేష్(Adivi Sesh) ఈఫిల్ టవర్ ముందు నిల్చుని కోపంగా చూస్తున్నారు. ఈ పోస్టర్‌తో పాటు ఈ నెలలో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో వామికా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్టర్ G-2పై హైప్ పెంచేసింది.


Advertisement

Next Story

Most Viewed