- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం.. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఫార్ములా-ఈ రేసు(Formula-E race) కేసు గంటకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్(KTR)కు ఈ రో హైకోర్టు(High Court)లో చుక్కెదురు కాగా.. ఏసీబీ అధికారులు(ACB officials) తమ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో గ్రీన్ కో సంస్థలపై వరుస దాడులు చేసి సోదాలు నిర్వహించింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్(KTR) సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు తన న్యాయవాదులతో చర్చిస్తున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఫార్ములా-ఈ రేసు కేసుపై సుప్రీంలో కేవియట్ పిటిషన్(Caveat Petition) దాఖలు చేసింది. అందులో ఒక వేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం తమ పిటిషన్‌లో కోరింది.
ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్(Justice Laxman Bench) తుది తీర్పును వెలువరించింది. ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే, తీర్పును వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఆయన తరుపు అడ్వొకేట్ కొరగా.. ఇలాంటి పిటిషన్లలో అవన్ని కుదరవని బెంచ్ స్పష్టం చేసింది. తాము ఈ విషయంలో ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్నారు హైకోర్టు తెలిపింది.