- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలి.. ఎస్పీ అఖిల్ మహాజన్..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మావోయిస్టులు వనం వదిలి జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. "పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి" కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామానికి చెందిన మావోయిస్టు యూజీ కడారి సత్యనారాయణ అలియాస్ కోస, అలియాస్ సాడు కుటుంబాన్ని కలిసి ఆయా రకాల పండ్లు అందజేశారు. సత్యనారాయణ జనజీవన స్రవంతిలో కలవడానికి కుటుంబ సభ్యుల సహకారం కావాలని స్ఫూర్తి నింపారు. ప్రభుత్వం అందించే పునరావసంతో పాటు ఇతర సదుపాయాల గురించి వారికి వివరించారు. అంతకు ముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో లొంగిపోయిన కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన జ్యోతి అలియాస్ జ్యోతక్కతో మాట్లాడారు.
తనకు రావలసిన పునరావాసంతో పాటు ఇతర సదుపాయాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యమం పేరిట అమాయకులు అడవి బాట పట్టి మావోయిస్టులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకున్నారన్నారు. అలాంటివారు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసే వారికి ప్రభుత్వం నుంచి అందించే అన్ని సదుపాయాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.