'BHARATPOL' పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా

by Mahesh |
BHARATPOL పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్: భారత కేంద్ర హోమ్ మంత్రి(Union Home Minister) అమిత్ షా(Amit Shah) ఈ రోజు ఢిల్లీలో 'BHARATPOL' పోర్టల్‌ను ప్రారంభించారు. దీనిని నేర వ్యవహారాల్లో ఇంటర్‌పోల్(Interpol) ద్వారా అంతర్జాతీయ సహాయాన్ని పొందేందుకు భారతదేశంలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల (LEA) ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించారు. భారతదేశంలో నేరాలకు పాల్పడి పారిపోయిన వారిపై 'రెడ్' కార్నర్ నోటీసుల('Red' corner notices)ను జారీ చేయడానికి అభ్యర్థనలను పోర్టల్ సులభతరం చేస్తుంది. ఈ 'BHARATPOL' పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ.. భారత్‌పోల్ మన దేశ అంతర్జాతీయ పరిశోధనలను కొత్త శకానికి తీసుకెళ్తుంది. ఇంటర్‌పోల్‌తో కలిసి పనిచేయడానికి సీబీఐ(CBI) మాత్రమే గుర్తించబడింది. దానికి తోడుగా భారతీయ ఏజెన్సీ భారత్‌పోల్‌ను ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల పోలీసులు ఇంటర్‌పోల్‌తో సులభంగా కనెక్ట్ కాగలుగుతారు. దీంతో నేరాలను నియంత్రించడానికి సమర్థవంతంగా పని చేస్తారు అని హోమ్ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు.

ఈ “భారత్‌పోల్‌తో అధునాతన సాంకేతికతను ఉపయోగించి అంతరాన్ని భర్తీ చేస్తామని. అంతర్జాతీయ నేరాలను విశ్లేషించడానికి దీని ద్వారా క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అందుకుంటామని అన్నారు. ఇది నేరాలు జరగడానికి ముందే వాటిని నిరోధించడానికి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంలో మాకు సహాయపడుతుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇంటర్‌పోల్ అనేది అంతర్జాతీయ నేరాల(International crimes)ను ఎదుర్కోవడానికి వివిధ దేశాల నుండి పోలీసు బలగాల మధ్య సహకారాన్ని సులభతరం చేసే అంతర్జాతీయ సంస్థ. భారత్‌పోల్‌('BHARATPOL')ను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు సీబీఐ(CBI)కి అట్టడుగు స్థాయి శిక్షణ ఇవ్వాలని హోంమంత్రి ఉద్ఘాటించారు. అన్ని ఇంటర్‌పోల్ నోటీసుల గురించి రాష్ట్ర పోలీసులకు పూర్తి సమాచారం ఉందని నిర్ధారించుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు. భారత్‌పోల్ లోని ఐదు ప్రధాన మాడ్యూల్స్ అన్ని చట్ట సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయని ఈ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed