గరికపాటి నరసింహారావు పై దుష్ప్రచారం.. తీవ్రంగా ఖండించిన టీమ్!

by Jakkula Mamatha |
గరికపాటి నరసింహారావు పై దుష్ప్రచారం.. తీవ్రంగా ఖండించిన టీమ్!
X

దిశ,వెబ్‌డెస్క్: కొన్ని రోజులుగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు(Garikapati Narasimha Rao) వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఈ క్రమంలో ‘‘కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. సదరు వ్యక్తుల పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావాలు వేస్తాం అని పేర్కొంది. వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో ఆయన క్షమాపణలు చెప్పినట్టు, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అవన్నీ నిరాధారం. సత్యదూరం. వీటిని తాము ఖండిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, వ్యక్తులపై పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరించింది. వీరి దుష్ప్రచారంతో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కలత చెందుతున్నారు’’ అని తెలిపింది. కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు గానీ, సోషల్ మీడియా గానీ ఇక పై ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు గరికపాటి నరసింహారావు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed