Dallewal: క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతు నాయకుడు!

by vinod kumar |
Dallewal: క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతు నాయకుడు!
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జిత్ సింగ్ దల్లేవాల్ (Jagjith singh dallewal) ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు వైద్యులు, రైతు నాయకులు తెలిపారు. ఆదివారం ఆయనకు తల తిరగడం, వాంతులు చేసుకోవడంతో పాటు స్పష్టంగా మాట్లాడలేకపోయారని వెల్లడించారు. ‘వాతావరణం బాగా లేనందున కిసాన్ మహాపంచాయత్ వేదికపైకి వెళ్లొద్దని దల్లేవాల్‌కు సూచించారు. కానీ సభను ఉద్దేశించి ప్రసంగించాలని ఆయన పట్టుబట్టారు. అంతేగాక సుమారు పదకొండు నిమిషాలు మాట్లాడారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన వాంతులు చేసుకున్నాడు’ అని దల్లేవాల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ అవతార్ సింగ్ (Awathar singh) తెలిపారు. దల్లేవాల్ ప్రతిచర్యలు మందగించాయని పేర్కొన్నారు. దల్లేవాల్‌కు కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా, గతేడాది నవంబర్ 26 నుంచి దల్లేవాల్ దీక్ష చేస్తు్న్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed