- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘చందు' క్లిక్ కి జాతీయ బహుమతి
దిశ, ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి వ్యక్తిగత ఛాయ చిత్రగ్రాహకుడిగా పనిచేస్తున్న చందు కి జాతీయ స్థాయి ఘనత దక్కింది. జనవరి 5,6 వ తేదీలలో హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రంలో సెవెంత్ నేషనల్ వర్క్ షాప్ పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో కన్సోలేషన్ విభాగంలో ప్రథమ బహుమతి లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా సహా పలు రాష్ట్రాలకు చెందిన 120 మందికి పైగా దిగ్గజ ఫోటోగ్రాఫర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గిరిజన జాతిలోని బొండాస్ అనే ఓ తెగకు సంబంధించిన వారి సాంప్రదాయ వేషధారణ, నృత్యాలు, జీవన శైలి విధానాలపై ఈ వర్క్ షాప్ జరిగింది. ఇందులో దిగ్గజ ఫొటోగ్రాఫర్లతో పోటీ పడిన చందు కి కన్సోలేషన్ విభాగంలో బహుమతి లభించడం విశేషం. చందు కి జాతీయ స్థాయిలో బహుమతి రావడం పట్ల జిల్లాకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.