Space Station : అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ కు గ్రీన్ సిగ్నల్

by M.Rajitha |   ( Updated:2025-01-08 15:07:39.0  )
Space Station : అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్ష కేంద్రంలో భారత స్పేస్ స్టేషన్(Space Station) ఏర్పాటు చేసేందుకు కీలక అడుగులు పడ్డాయి. స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అనుమతించినట్టు, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి నారాయణన్(ISRO Cheif V Narayanan) వెల్లడించారు. కాగా ఇస్రో చీఫ్ గా నారాయణన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇస్రో విజ‌య‌వంత‌మైన ద‌శ‌లో వెళ్తోంద‌న్నారు. చేప‌ట్టబోయే ప్రాజెక్టుల గురించి వివ‌రిస్తూ.. స్పేడెక్స్ మిష‌న్‌ను డిసెంబ‌ర్ 30వ తేదీన చేప‌ట్టామ‌ని, జ‌న‌వ‌రి 9వ తేదీన స్పేడెక్స్ శాటిలైట్ల డాకింగ్ జ‌ర‌గ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. గ‌గ‌న్‌యాన్(Gaganyan) కూడా ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రోగ్రామ్ అని పేర్కొన్నారు.

క్రూ లేకుండా మాడ్యూల్‌ను ప్రయోగించే దాని కోసం ఇస్రోలో ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. జీఎస్ఎల్వీ ద్వారా ఎన్వీఎస్ 02 నావిగేష‌న్ శాటిలైట్ను పంపేందుకు శ్రీహ‌రికోట‌లో వ‌ర్క్ జ‌రుగుతోంద‌న్నారు. ఇస్రో మాక్ 3 వెహికిల్ ద్వారా అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ శాటిలైట్‌ను కూడా ప్రయోగించ‌నున్నట్టు తెలిపారు. గ‌గ‌న్‌యాన్ రాకెట్ అసెంబ్లింగ్‌కు చెందిన ప‌నులు కూడా శ్రీహ‌రికోటలో జరుగుతున్నాయని అన్నారు. చంద్రయాన్‌3 ద్వారా చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై ల్యాండ్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే అన్నారు.

చంద్రయాన్ 4(Chandrayan 4) ద్వారా ఆ ప్రదేశంలో చంద్రుడిపై ల్యాండ్ అయి, శ్యాంపిళ్లు సేక‌రించిన త‌ర్వాత మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే రీతిలో ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. భార‌త స్పేస్ స్టేష‌న్‌ని సెట‌ప్ చేసేందుకు ప్లాన్ జ‌రుగుతోంద‌న్నారు. స్పేస్ స్టేష‌న్ నిర్మాణం కోసం ప్రధాని మోదీ అనుమ‌తి కూడా త‌మ‌కు ద‌క్కింద‌న్నారు. స్పేస్ స్టేష‌న్‌కు అయిదు మాడ్యూళ్లు ఉంటాయ‌ని, 2028లో స్పేస్ స్టేష‌న్‌కు తొలి మాడ్యూల్‌ను లాంచ్ చేసే రీతిలో అనుమ‌తి ద‌క్కింద‌న్నారు.

Read More ...

ISRO: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి నారాయణన్‌.. ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం


Advertisement

Next Story

Most Viewed