Bangladesh: 50 మంది న్యాయమూర్తులకు భారత్‌లో ట్రైనింగ్.. ప్రోగ్రాంను రద్దు చేసిన బంగ్లాదేశ్

by vinod kumar |
Bangladesh: 50 మంది న్యాయమూర్తులకు భారత్‌లో ట్రైనింగ్.. ప్రోగ్రాంను రద్దు చేసిన బంగ్లాదేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు శిక్షణ కోసం భారత్‌కు రావాల్సిన కార్యక్రమాన్ని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2017లో షేక్ హసీనా(Sheik haseena) ప్రధానిగా ఉన్నప్పుడు జడ్జిల శిక్షణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరిగే శిక్షణలో న్యాయమూర్తులు పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం హసీనా ప్రభుత్వం లేక పోవడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత యూనస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. అయితే 50 మంది న్యాయమూర్తులు ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి వెళ్లనున్నారని బంగ్లాదేశ్‌లోని సంగ్‌బాద్ సంస్థ ప్రకటించిన ఒక రోజు తర్వాత దీనిని క్యాన్సిల్ చేస్తున్నట్టు ఆదేశాలు రావడం గమనార్హం. కాగా, షేక్ హసీనా ప్రభుత్వం పతనం అనంతరం భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అగ్రిమెంట్ రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed