- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చింతకాని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ముందడుగు..
దిశ, చింతకాని : చింతకాని మండలం రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఖమ్మం మార్కెట్ ఎర్పడిన నాటి నుండి చింతకాని మండలంలోని రైతులు వారి పంటను ఖమ్మం మార్కట్ లో అమ్ముకునే వారు గత కొంత కాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి చింతకానిలో వ్యవసాయ మార్కట్ నిర్మాణం గురించి వివరించారు. భట్టి విక్రమార్క రైతుల అవసరాన్ని గుర్తించి చింతకానిలో మార్కెట్ నిర్మాణంకు ముందడుగు వేశారు. చింతకాని మండలంలో మోత్కెపల్లి రెవెన్యూ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలమని ఆ మండలాల రైతులు డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గతంలో వినతి పత్రం అందజేశారు.
మోత్కేపల్లి రెవెన్యూ పరిధిలో మార్కెట్ యార్డ్ నిర్మాణం చేపట్టాలని, ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు నిర్మించడం ద్వారా ముదిగొండ చింతకాని బోనకల్లు మండలాల రైతులు పంటను యార్డుకు తరలించి అమ్ముకునేందుకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నుండి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాలకు పప్పుధాన్యాలు, మిర్చి తదితర పంటలను రవాణా చేసేందుకు దగ్గరలోనే పందిళ్ళపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందని, అదేవిధంగా రెండు జాతీయ రహదారులతో పాటుగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన వత్సవాయి - చిల్లకల్లు జాతీయ రహదారి నుండి పంట రవాణా చేసేందుకు అనువుగా ఉంటుందని, ఈ స్థలములో మార్కెట్ యాడ్ నిర్మాణం చేపట్టాలని చింతకాని ముదిగొండ బోనకల్లు మండలాల ప్రజలు, రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.