Atchannaidu : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి : అచ్చెన్నాయుడు

by Y. Venkata Narasimha Reddy |
Atchannaidu : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి : అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజల( People of AP)కు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు( Minister Atchannaidu) గుడ్ న్యూస్(Good news)తెలిపారు. రేపు విశాఖలో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్(Railway Zone)కు రేపు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ ఆరు మాసాల్లో 6వేల కోట్లయిన హైవేలు సహా పలు అభివృద్ధి పనులను కేంద్రం మంజూరు చేసిందన్నారు.

రేపు ప్రధాని శంకుస్థాన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు(Green Hydrogen Power Project)తో ఉత్తరాంధ్రకి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోడీలు ఏపీ అభివృద్ధి అలోచనతో పనిచేస్తుండటంతో రాష్ట్రం వెంటిలెటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థితికి చేరుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని గొప్ప అవకాశం ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిందన్నారు. అధికార టీడీపీ ఎన్డీయేలో భాగమైనందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విస్తరింపజేస్తున్న ప్రయోజనాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. తొలి విడతగా 60వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో త్వరలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గబోతున్నాయని వెల్లడించారు.

వైసీసీ హయంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను దెబ్బతీశారన్నారు. దీంతో చార్జీల భారం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్టీపీసీ(NTPC), న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP)తో గ్రీన్ ఎనర్జీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి అంచనాలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మొదటి దశలో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. రోజుకు 1100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా.. 2027 మే నెల నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుతో 1.06 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు రానున్న 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.20,620 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed