యూనివర్సిటీ విద్యార్థులకు గొడ్డుకారంతో అన్నం.. వీడియోలు వైరల్

by Mahesh |
యూనివర్సిటీ విద్యార్థులకు గొడ్డుకారంతో అన్నం.. వీడియోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా హస్టర్ విద్యార్థులకు దారుణంగా భోజనం(meal) పెడుతున్నారనే విమర్శలు ప్రత్యక్షంగా వినపడుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేస్తూ.. పలు హాస్టల్ విద్యార్థులకు పెట్టిన నాసిరకం భోజనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతునే ఉన్నాయి. ఈ సారి ఏకంగా విశ్వవిద్యాలయం(University) విద్యార్థులకు టిఫిన్ లో గొడ్డుకారం పెట్టిన వీడియో ప్రస్తుతం తెలంగాణలో వైరల్(viral)గా మారుతోంది. ఉదయం అన్నంలో గొడ్డుకారం పెట్టిన విచిత్ర ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University)లో చోటు చేసుకుంది.

యూనివర్సిటీలో ఉన్న కృష్ణవేణి హాస్టల్‌(Krishnaveni Hostel)లో ఉదయం విద్యార్థులకు గొడ్డు కారం(chillipowder)తో అన్నం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలను విద్యార్థినులు తీసి.. వారి ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో యూనివర్సిటీ హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలోను హాస్టల్ సిబ్బంది ఇలానే వ్యవహరించడంతో.. యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఉదయం విద్యార్థినులు(female students) గొడవకు దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed