- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యే సారు ఆ ఒక్క చోట కల్వర్టును ఎత్తు పెంచండి..
దిశ, తలకొండపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు దశాబ్ద కాలం క్రితం తలకొండపల్లి నుండి మిడ్జిల్ వరకు ఉన్న 19.5 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబల్ రోడ్డుగా మార్చడానికి అప్పట్లో ఆ ప్రభుత్వం 22.50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. అయినా పూర్తిస్థాయిలో పనులను చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చంద్రధన మాజీ సర్పంచ్ బక్కి కుమార్ పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల పాటు సర్పంచ్ గా కొనసాగిన సమయంలో తనతో పాటు చాలా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం తమ బాధలను ఆలకించిన పాపాన పోలేదని, నిధులు ఉండి పనులు చేయలేక నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఐదు కల్వట్లను పునరుద్ధరణ పనులు చేయడం మేము స్వాగతిస్తున్నామని దిశ ప్రతినిధితో మాట్లాడుతూ బక్కి కుమార్ తెలిపారు. తలకొండపల్లి నుండి చంద్రధన గ్రామం వరకు ఉన్న ఈ ఐదు కల్వట్ల నిర్మాణం పనులలో భాగంగా చంద్రదన్న గ్రామ సమీపంలోని కామన్ వద్ద ఉన్న కల్వర్టు, నల్ల చెరువు సమీపంలోని బ్రిడ్జ్ పనులు వద్ద మాత్రం కొద్దిమేర పెండింగ్లో ఉన్నందున కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆర్ అండ్ బి అధికారులు మరో 60 లక్షలతో పనులు పూర్తి చేయొచ్చని అధికారులు విన్నవించారని తెలిసింది.
50 సంవత్సరాల తర్వాత నిండిన నల్లచెరువు..
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల ఈ రహదారిలో ఉన్న నల్లచెరువు బ్రిడ్జి నిర్మాణ పనులను శాశ్వతంగా పూర్తి చేయాలని గ్రామస్తులు, బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నట్లు కుమార్ తెలిపారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల ఈ బ్రిడ్జి మొత్తం నీళ్లలో రెండు, మూడు రోజుల పాటు మునిగిపోయిందని, అప్పట్లో తలకొండపల్లి పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేసి బ్రిడ్జి పై నుండి ఎవరు వెళ్లకుండా కాపలా కాశారని, ఈ బ్రిడ్జి కొద్దిగా ఎత్తు లేపి మళ్లీ కొత్తగా నిర్మిస్తే, అదే విధంగా కమాన్ వద్ద మిగిలిపోయిన బ్రిడ్జ్ వద్ద మాత్రం కల్వర్టు పై పైపులు వేసి ఎత్తు లేపినా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన ఈ పనులను పూర్తి చేయడానికి 60 లక్షల నిధుల ప్రతిపాదనలతో పాటు మరో 80 నుండి కోటి రూపాయల వరకు అదనంగా నిధులు మంజూరు చేయిస్తే తలకొండపల్లి నుండి మిడ్జిల్ మండల కేంద్రం వరకు ఉన్న రహదారి మొత్తం సర్వాంగ సుందరంగా మారుతుందని, ఈ పెండింగ్ పనులను పూర్తి చేయిస్తే మీ పేరు కూడా చిరస్థాయిగా నిలుస్తుందని, ఈ రహదారి పై నుండి ఎన్నో గ్రామాలకు చెందిన వందలాది మంది వాహనాలు ప్రతినిత్యం ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.