- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసాంఘిక కార్యకలాపాల అణచివేతే లక్ష్యం.. అడిషనల్ ఎస్పీ రామేశ్వర్
దిశ, వెల్దండ : ప్రజల భద్రతను మరింత పెంపొందించేందుకే అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఎంజీ కాలనీ తండాలో మంగళవారం జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, కల్వకుర్తి డీఎస్పీ, వెల్దండ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లలో పరిసరాలు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ మాట్లాడుతూ అసాంఘిక చర్యల నివారణలో పోలీసు సిబ్బందితో ప్రజలు భాగస్వామ్యం కావాలని, మీ ప్రాంతంలో అసాంఘిక చర్యలు జరగకుండా ఉండాలంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం కోసం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్‌లు లేకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. సెల్‌ఫోన్ ద్వారా జరిగే సైబర్ క్రైంకు మోసపోకుండా తీసుకునే జాగ్రత్తలను తెలియజేశారు. ప్రజలు ఎప్పటి కప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసుకు తెలియజేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
కార్డన్‌సెర్చ్‌లో 150 ఇండ్లను, 35 వాహనాలతో పాటు రూ.20,500 రూపాయల విలువగల నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండ ఎస్సై కురుమూర్తి, కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.