- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ పండుగలు.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
దిశ, గంగాధర : సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన తెలంగాణ పండుగలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాలలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ( శీతల దేవి) ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సహకారం అందజేస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో జీవించాలని పోచమ్మ తల్లికి పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలు పంచుకుంటానని ఎమ్మెల్యే సత్యం అన్నారు.