అభివృద్ది పనులలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారులు..

by Sumithra |
అభివృద్ది పనులలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారులు..
X

దిశ, అల్వాల్ : మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలను అధికారులు నిర్లక్ష్యంతో ప్రోటో కాల్ కు విరుద్దంగా జరిపిస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు సర్కిల్ అధికారుల పై ఆరోపించారు. తమ డివిజన్లలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పితేనే పనులు జరుగుతున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. చివరికి స్థానిక ఎమ్మెల్యేకు సైతం తెలియజేయకుండా పనులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. మొత్తం వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుని అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో అధికారులు పని చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. తమపై రాజకీయ ఒత్తిడి ఉందని ఒప్పుకుంటున్నారని సదరు అధికారుల పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేయర్ విజయ లక్ష్మిని కోరారు.

చట్టానికి విరుద్దంగా అధికారుల చర్యలు...

మల్కాజిగిరి నియోజకవర్గం అధికారులు వారి పరిధిని దాటి చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. వారి పై తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 153 - 154 - 155 ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఫ్రోటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడిన ఆధారాలు అయిన వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను వినతి పత్రంతో పాటు అందించారు. అధికారం అనేది శాశ్వతం కాదని చట్టం శాశ్వతమైందని అధికారులు గుర్తించేలా మేయరుగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిశోర్ గౌడ్,నేరేడ్ మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, గౌతం నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed