- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand : 89 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. సంచలనం రేపుతున్న రిపోర్ట్
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేల్లో 89 శాతం మంది కోటీశ్వరులే ఉన్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థలు ఈ మేరకు తమ రిపోర్టులను వెల్లడించాయి. ఇందులో 14 మంది కొత్త ఎమ్మెల్యేలు రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారని సంస్థ పేర్కొంది. రూ.42.20 కోట్లతో లోహర్‌దాగా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేశ్వర్ ఓరావొన్ ఈ జాబితాలో టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రూ.32.15 కోట్లతో పాంకీ నియోజవర్గం నుంచి గెలిచిన కుశ్వాహ శశి భూషన్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రూ.29.59 కోట్లతో మూడో స్థానంలో ఆర్జేడీకి చెందిన సంజయ్ ప్రసాద్ యాదవ్ ఉన్నట్లు తెలిపింది.
2014తో పోలిస్తే..
2019లో గెలిచిన ఎమ్మెల్యేలు రూ.3.87 కోట్ల సరాసరి ఆస్తి కలిగి ఉండగా.. 2024లో గెలిచిన ఎమ్మెల్యేలు రూ.6.90 కోట్ల ఆస్తి కలిగి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసిన 81 మంది ఎమ్మెల్యేల్లో 80 మంది అఫిడవిట్‌లను పరిశీలించినట్లు సంస్థ పేర్కొంది. ఇందులో కొత్తగా గెలిచిన 71 మంది కోటీశ్వరులే అని సంస్థ తెలిపింది. ఈ 71 మంది ఎమ్మెల్యేల్లో 28 మంది జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా)కు చెందిన వారు కాగా, 20 మంది బీజేపీ, 14 మంది కాంగ్రెస్, నలుగురు ఆర్జేడీ, ఇద్దరు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఎల్జేపీ(రామ్ విలాస్), జేడీ(యూ), ఏజేఎస్‌యూ పార్టీల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు వెల్లడించింది. 2019తో పోలిస్తే ఈ సారి అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య 20 శాతానికి పెరిగిందని తెలిపింది. 2019లో 56 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉండగా.. 2014లో ఈ సంఖ్య 41గా ఉన్నట్లు వెల్లడించింది.