Israel–Hezbollah : కాల్పుల విరమణకు ముందడుగు

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-25 15:48:34.0  )
Israel–Hezbollah : కాల్పుల విరమణకు ముందడుగు
X

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ అంశంలో ఇజ్రాయెల్‌కు అభ్యంతరాలు ఉండగా కొన్ని ప్రతిపాదనలను సోమవారం లెబనాన్‌ ముందు ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాతే ఈ డీల్ చట్టబద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కేబినెట్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇజ్రాయెల్ పభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెల్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందం దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. కొన్ని అంశాలకు పరిష్కారం లభించాల్సి ఉందని తెలిపాడు. మరోవైపు వారం రోజులుగా ఇజ్రాయెల్ సెంట్రల్ బీరూట్ లక్ష్యంగా భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 29 మంది చనిపోయారు. ఇరాన్ మద్దతు హెజ్బుల్లా సైతం ఇజ్రాయెల్‌పై 250 మిసైల్ దాడులు చేసింది. మధ్యవర్తి్త్వం చేస్తున్న యూఎస్ అధికారులు ఇజ్రాయెల్, హెజ్బుల్లా అనుసరిస్తున్న శత్రుత్వ వైఖరిని ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకునేలా చర్చలు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం జరగనున్నట్లు ఇజ్రాయెల్ రాయబారి మైక్ హెర్జోగ్ వాషింగ్టన్‌కు తెలిపారు. కొన్ని అంశాలను ఫైనలైజ్ చేయాల్సి ఉందన్నారు.

Advertisement

Next Story