Patnam Narendar Reddy : పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పై ఐజీ ఫైర్

by M.Rajitha |   ( Updated:2024-12-26 12:37:14.0  )
Patnam Narendar Reddy : పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పై ఐజీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన(Lagacharla Issue)లో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) బెయిల్ పై జైలు నుండి విడుదలయిన సంగతి తెలిసిందే. కాగా నేడు పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని, సాక్ష్యాలు లేకుండా అన్యాయంగా తమను ఈ కేసులో ఇరికించారని అన్నారు. పోలీసులు లగచర్ల రైతులను కొట్టారని, గ్రామంలో ఆడవారిపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు. కాగా నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పై ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కండిషన్ బెయిల్ మీద ఉండి మీడియా సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, ఈ వ్యవహారంలో నరేందర్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోర్టుకు చేస్తామని పేర్కొన్నారు. విచారణను ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. లగచర్లలో 230 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, పోలీసుల వైఫల్యం అనడం సరికాదని అన్నారు. కలెక్టర్ మీద దాడి చేసినందుకే నిందితులను అరెస్ట్ చేశామని, పోలీసులు ఎవరినీ కొట్టలేదని ఐజీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed