- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SC,ST Commission: త్వరలో సీఎంకు గ్రౌండ్ లెవల్ రిపోర్టు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి లగచర్ల కేసులో క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakkini Venkataiah) అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల, రొటిబండ తండాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో (Sangareddy Jail) లగచర్ల ఘటనలో (Lagacharla Incident) అరెస్టు అయిన 24 మందితో కమిషన్ సభ్యులు భేటీ ములాఖత్ అయ్యారు. ఈ భేటీ అనంతరం బక్కి వెంకటయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని సీఎంను కోరుతామని చెప్పారు. ఘటన జరిగి 10 రోజులు దాటినా ఇప్పటికి గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారని, కలెక్టర్ పై దాడి ఘటన దురదృష్టమే కానీ అమాయకులను జైల్లో పెట్టారన్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహారించారన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.