- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Winter: శీతాకాలంలో గది వేడిగా ఉండాలని రూమ్ హీటర్ వాడుతున్నారా..? దీనికి బదులు
దిశ, వెబ్‌డెస్క్: చూస్తుండగానే చలికాలం(Winter) రానే వచ్చేసింది. జనాలు బయటికి వెళ్దామంటే చలికి వణికిపోతున్నారు. పట్టణ ప్రజలు ఉదయం పూట స్వెటర్లు(Sweaters) లేనిదే బయటికి రావడం లేదు. పల్లెల్లో నివసించేవారు తెల్లారితే చాలు మంట కాచుకుంటున్నారు. మునపటి కన్నా చలి తీవ్రత బాగా ఉండటంతో ప్రజలు అమ్మో చలి అంటూ భయపడిపోతున్నారు.
అయితే కొంతమంది చలికి తట్టుకోలేక శీతాకాలంలో రూమ్ హీటర్(room heater) వాడుతారు. ఈ హీటర్ వల్ల గది వెచ్చగా ఉంటుంది. కానీ హీటర్ నుంచి వచ్చే వేడి గాలి స్కిన్(Skin)కు హాని కలుగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాగా హీటర్ లేకుండా మీ బెడ్‌రూమ్(Bedroom)ను సహజంగా వెచ్చగా ఉంచుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..
చలికాలం ఇల్లంతా వెచ్చగా ఉండాలంటే విండోస్(Windows), డోర్స్(Doors) క్లోజ్ చేసి ఉంచాలి. ఒకవేళ ఏ మూల నుంచైనా గ్యాప్ ఉన్నట్లైతే.. ఆ ప్లేస్‌లో టేప్ లేదా ఏదైనా క్లాత్‌తో మూసివేస్తే సరిపోతుంది. అలాగే పగలు ఎండ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు తెరిచి ఉంచండి. సూర్యరశ్మి(sunshine) ఇంట్లోకి రావడం వల్ల గది ఉష్ణోగ్రత(temperature) పెరుగుతుంది.
నేల మీద మందంగా ఉండే ప్యాడెడ్ కార్పెట్(Padded carpet) వేయండి. లేకపోతే రగ్గు వేయండి. అలాగే మంచంపై షీట్ వేయడానికి ముందు మందమైన దుప్పటిని వేస్తే కాస్త వేడిగా ఉంటుంది. డోర్స్, విండోస్‌కు ముదురు కలర్ ఉన్న కర్టెన్లు వేయండి. ఇవి వేడిగాలిని బయటికి వెళ్లకుండా ఆపుతాయి.
చలికాలం సాయంత్రం పూట గది టెంపరేచర్ తగ్గుతుంటే వెంటనే కొవ్వొత్తులు(Candles) వెలిగించండి. లేదా దీపాలు(lamps) అయినా వెలిగించవచ్చు. కానీ పడుకునే ముందు వాటిని ఆర్పేయాలి. అలాగే నిద్రించేటప్పుడు మీ పక్కన బాటిల్‌లో హాట్ వాట్ పోసి పక్కన పెట్టుకోండి. దీంతో గది వేడిగా ఉంటుంది. పగలు సూర్యరశ్మి(sunshine) తాకేలా అద్దం అడ్డుగా పెట్టండి. దీంతో భానుడి వేడి అన్ని వైపులా వ్యాపిస్తుంది. దీంతో గది ఎక్కువ సమయం పాటు వెచ్చగా ఉంటుంది.
Read More...
వింటర్‌లో వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్ సూప్.. ఇలా చేసేయండి