- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డుపై మొసళ్ల సంచారం.. హడలెత్తిపోతున్న ప్రయాణికులు
దిశ, వీపనగండ్ల: మండల పరిధిలోని వీపనగండ్ల--గోవర్ధనగిరి ప్రధాన రోడ్డు పక్కన ఉన్న కత్వ చెరువులో మొసళ్లు సంచరిస్తున్నాయి. రిజర్వాయర్ అలుగునీరు ఈ చెరువులోకి వస్తున్నడంతో మొసళ్లు కూడా నీళ్ల వెంట వస్తున్నాయి. మొసళ్లు రాత్రిపూట ఒడ్డుకొచ్చి సేద తీరుతున్న ఏమి చేయలేకపోతున్నామని, వాటిని బంధించి తీసుకువెళ్లాలని అటవీ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని స్థానికులు,ప్రయాణికులు వాపోతున్నారు. దప్పిక తీర్చుకోవటానికి వెళ్ళిన మూగజీవాలు మొసళ్లు బారిన పడిన సంఘటనలు ఉన్నాయని రైతులు తెలిపారు. రాత్రి వేళలో మొసళ్లు కల్వర్టు పైకి వచ్చి సేద తీరుతున్నాయని ,వాహనదారులు ఏమాత్రం పొరపాటుగా వచ్చిన మొసళ్లు బారిన పడాల్సి వస్తుందని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రాత్రివేళలో ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే మొసళ్లు భయానికి భయపడిపోతున్నారు. అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగే వరకూ అధికారులు మేలుకోరని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ అధికారులు మొసళ్లు ను బంధించి తీసుకువెళ్లాలని లేదా చెరువుల వద్ద మొసళ్లు ఉన్నాయంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.