- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Routines : ఉదయాన్నే ఈ పొరపాట్లు.. ఆ సమస్యలకు దారితీస్తాయ్ !
దిశ, ఫీచర్స్ : కొన్ని హాబిట్స్ వల్ల మనం ఆనందంగా ఉంటాం. మరికొన్నింటివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రతిరోజూ ఉదయంపూట చేసే కొన్ని పొరపాట్లు, అధిక బరువుకో, అలర్జీలకో, తీవ్రమైన అనారోగ్యాలకో దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పైగా అలాంటి మిస్టేక్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వాలన్న మీ లక్ష్యం కూడా నెరవేరకపోవచ్చునని చెబుతున్నారు. ఇంతకీ ఏ విధమైన మిస్టేక్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలా నివారించాలో చూద్దాం.
* బ్రేక్ ఫాస్ట్ : అధిక బరువు సమస్యతో బాధపడే చాలామంది పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీనివల్ల వెయిట్ లాస్ అవుతామని భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది. ఇది క్రమంగా తినే రుగ్మతలను పెంచడం ద్వారా ఒకేసారి అధికమొత్తంలో ఫుడ్ తీసుకోవడం, కార్బొహైడ్రేట్లు అధికంగా తీసుకోవడంవల్ల బరువు పెరగవచ్చు. కాబట్టి ఉదయంపూట హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్‌లతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
* స్వీట్లు తినడం : కొందరు స్వీట్లు తినకుండా అస్సలు ఉండలేరు. ఉదయాన్నే ఏదో ఒక స్వీట్ తినడంతోనే ఆ రోజును ప్రారంభించేవారు చాలామందే ఉంటారు. అట్లనే స్వీట్, షుగర్‌తో కూడిన పానీయాలు తాగుతుంటారు. టీ, కాఫీలల్లో అధికంగా షుగర్ కలిపి తాగేస్తుంటారు. క్రమంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి, అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి స్వీట్లను తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
* వాటర్ తాగక పోవడం : రాత్రిపూట సహజంగానే నీరు తక్కువగా తాగుతుంటాం. కాబట్టి ఉదయం లేవగానే నీళ్లు తాగుతుంటారు. కానీ కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేశాక కూడా తక్కువ నీరు తాగుతుంటారు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురికావడం, డల్‌నెస్ పెరగడం వంటివి జరుగుతాయి. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. పైగా శరీరంలో సరిపడా నీరు లేకపోతే కేలరీలు బర్న్ కావంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం నీరు తాగడం ముఖ్యం.
* ఎక్కువసేపు నిద్రపోవడం : నిద్ర మంచిదే కానీ.. ఎప్పుడంటే అప్పుడు కాదంటున్నారు నిపుణులు. ఉదయం కూడా ఆలస్యమైనా లేవకపోవడం ఏదో మధ్యాహ్నం తర్వాత లేవడం వంటివి నేచురల్ బాడీ రిథమ్స్‌ను రివర్స్ చేస్తాయి. దీనివల్ల కొందరు అలసటకు, అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పొరపాటు చేయకండి. రోజూ ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీంతోపాటు ప్రతిరోజూ తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం వ్యాయామాలు చేయాలి. మెడిటేషన్, యోగా వంటివి కూడా శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందాన్ని ఇస్తాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.