KTR : నా పునరాగమనం మరింత బలంగా ఉండబోతుంది : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : నా పునరాగమనం మరింత బలంగా ఉండబోతుంది : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ కారు రేసులో ఎదురైన ప్రతికూల పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. నా మాటలు గుర్తు(Mark My Words) పెట్టుకోవాలని..ప్రస్తుత ఈ ఎదురుదెబ్బ..వెనుకడుగు(Than This Setback) కంటే.. మా పునరాగమనం(Our Comeback) మరింత శక్తివంతం(Be Stronger)గా ఉండబోతుందని ట్వీట్ చేశారు. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవని..మీ మాటలు నన్ను తగ్గించలేవని, మీ చర్యలు నా లక్ష్యాన్ని, దృష్టిని మరుగుపరుచలేవంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కోపోద్రిక్తత పరిస్థితులు నన్ను నిశ్శబ్దం చేయబోవంటూ స్పష్టం చేశారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయని, సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాననని, న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకమని పేర్కొన్నారు. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుందని, త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story