నేతన్నలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి

by Naveena |
నేతన్నలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి
X

దిశ ,భూదాన్ పోచంపల్లి: చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న నేతన్నలు ఆర్థికంగా బలోపేతం కావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి చేనేత టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం 47 వ వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే 300 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత పది ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. త్రిఫ్ట్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 270 కోట్లు రూపాయలు ఇచ్చిందని, అందులో పోచంపల్లికే 30 కోట్లు ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తడక వెంకటేష్, చేనేత టై అండ్ డై అసోసియేషన్అ ధ్యక్షుడు భారత లవ కుమార్ ,ప్రధాన కార్యదర్శి ముస్కూరి నరసింహ,గౌరవ అధ్యక్షులు కర్నాటి బాలరాజు,ఉపాధ్యక్షులు ఈపూరి ముత్యాలు,కుడికాల రామ్ నరసింహ, సహాయ కార్యదర్శిలు గంజి బాలరాజు, వనం దశరథ, సీత సుధాకర్, కోశాధికారి మంగళపల్లి రమేష్, కార్యవర్గ సభ్యులు వనం శంకర్, సీత భవాని శంకర్, కడివేరు సత్యనారాయణ, కందగట్ల శంకరయ్య, రచ్చ భాస్కర్, సీత కృష్ణ, నామాల శ్రీనివాస్, వేముల నరేష్, కడవేరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed