INC: చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చిల్లర పనులా..? కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్

by Ramesh Goud |
INC: చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చిల్లర పనులా..? కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చిల్లర పనులా కేటీఆర్ అని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ వివాదం(Farmula E Race Issue)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కేటీఆర్ మాట్లాడుతూ.. తప్పు చేసిన చేసిన వాడు భయపడాలి.. మీరు ఎందుకు భయపడుతున్నారని, తప్పు చేయకుంటే విచారణను ఎదుర్కొని, ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని అన్నారు. దీనిపై చామల కిరణ్.. తప్పు చేయనప్పుడు డోంకతిరుగుడు మాటలు ఎందుకు అని, వితండవాద ప్రేలాపనలు.. వింత విన్యాసాలు.. ఎందుకని నిలదీశారు. అంతేగాక నీ మాటల్లో డొల్లతనం చూస్తుంటే నువ్వు తప్పు చేసినట్టు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం చిల్లర పనులా కేటీఆర్? అని కాంగ్రెస్ ఎంపీ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed