Minister Tummala : రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం : మంత్రి తుమ్మల

by Y. Venkata Narasimha Reddy |
Minister Tummala : రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం : మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : రైతుభరోసా(Raitu Bharosa) పథకం అమలు(Implement)కు చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageswara Rao)అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధారంగాల ప్రగతిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిష్కారంలో జరిగిన జాప్యం పట్ల అధికారులపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు.

అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరములో ఇంకో 1000 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశాలిచ్చారు.

వర్సిటీలలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాల వృద్దికి, కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని, వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed