CM Chandrababu:'జననాయకుడు'తో సుపరిపాలన.. వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సీఎం

by Jakkula Mamatha |
CM Chandrababu:జననాయకుడుతో సుపరిపాలన.. వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎనిమిది సార్లు తనను గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత జననాయకుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కుప్పంను అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జననాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఎవరైనా తమ సమస్యను ఇక్కడకు వచ్చి చెప్పుకున్న, వాట్సాప్ లో తెలియజేసిన ఫోన్లో మెసేజ్ చేసినా కార్యకర్తలు ప్రజా సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చినా.. వాటిని జననాయకుడు పోర్టల్ లో రికార్డు చేస్తామన్నారు. వాటిని విశ్లేషిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు కీలకమని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పై ఉంటుందని పేర్కొన్నారు. వరుసగా ఎనిమిది సార్లు గెలిపించిన నియోజకవర్గానికి నేను ఎంతో చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రిగా అయినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకు నాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నారు. ఈ మూడు బాధ్యతలు నిర్వహించడానికి జననాయకుడు పోర్టల్ ను ప్రారంభించామని వెల్లడించారు. ఇక్కడికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని దానిపై ఒక నిర్దిష్టమైన పద్ధతిని అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒక వినూత్నమైన ప్రయోగం అన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పోర్టర్లో సమస్య పరిష్కరించిన తర్వాత పిటిషనర్ కు తెలియజేస్తామని అన్నారు. మా నాయకులు వీటిని ఫాలోఅప్ చేస్తారని అన్నారు. ఈ వ్యవస్థ సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాలకు పెంచుతామని సీఎం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed