Karthikeya: ‘అబద్ధమేవ జయతే’.. కొత్తగా ఉందంటున్న హీరో కార్తికేయ

by sudharani |   ( Updated:2024-11-25 16:33:22.0  )
Karthikeya: ‘అబద్ధమేవ జయతే’.. కొత్తగా ఉందంటున్న హీరో కార్తికేయ
X

దిశ, సినిమా: సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అబద్ధమేవ జయతే’ (Abadhameva Jayate). కె. కార్తికేయన్ సంతోష్ (K. Karthikeyan Santosh) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ (Village Back Drop)లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. ఈ క్రమంలోనే సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేస్తున్నారు చిత్ర బృందం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మూవీ యూనిట్ తాజాగా టైటిల్ లోగో (title logo)ను యంగ్ హీరో కార్తికేయ (Kartikeya) చేతుల మీదుగా లాంచే చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా కొత్తగా ఉంది. కచ్చితంగా మూవీ కూడా అందరికి ఆకర్షిస్తుంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డితో పాటు మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం, బలగం సుధాకర్, రాజశేఖర్ అనింగి, శరత్ బగిరాల, సతీష్ సారిపల్లి, సుజాత, మాయానంద్ ఠాకూర్, అర్రున్ సవ్వనా, నటుడు ప్రదీప్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Read more...

Vijay Devarakonda: రౌడీ హీరో ‘రౌడీ వేర్’ బ్రాండ్‌కు అరుదైన అవార్డ్.. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే?


Next Story

Most Viewed