రైతు సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

by Naveena |
రైతు సభకు ముమ్మరంగా ఏర్పాట్లు
X

దిశ, భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు సదస్సు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. మూడు రోజులపాటు జరిగే రైతు సభలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల స్టాల్స్ ఏర్పాటు..కార్యక్రమానికి హాజరుకానున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై అధికారులు, ఎమ్మెల్యే చర్చించారు. ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తు ఉండాలని రాష్ట్ర అధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్, మార్కెటింగ్ అధికారి బాలమణి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed