విజయోత్సవ సభలు కాదు.. అబద్దోత్సవ సభలు : రసమయి బాలకిషన్

by Sumithra |
విజయోత్సవ సభలు కాదు.. అబద్దోత్సవ సభలు : రసమయి బాలకిషన్
X

దిశ, మానకొండూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు నివాసంలో మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29 న కరీంనగర్ లో జరిగే కేసీఆర్ కృతజ్ఞత సభ దీక్ష దివస్ ను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం 2001 లో కరీంనగర్ జిల్లా నుండి ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశానికి మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహ దీక్ష ఎంత గొప్పదో , తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష అంతే గొప్పదని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి గ్రామ గ్రామాన కనపడుతుందని అన్నారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో పూర్తిగా అమలు చేయలేక పోవడం పై కాంగ్రెస్ నాయకులు చెంపలు వేసుకొని ప్రజలను భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం సాధించారని ప్రజా పాలన ఉత్సవాలు జరుపుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి మోసం చేశారని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తానని ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికి పూర్తిగా హామీలు అమలు చేయలేదని అన్నారు. దీక్ష దివస్ అనంతరం పార్టీ ముఖ్య నేతలతో చర్చించి గ్రామ గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, సిరిసిల్ల మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మానకొండూరు మండల మాజీ జడ్పీటీసీ, సీనియర్ నాయకులు కనకం అనిల్, యాదగిరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఇస్కుల్లా అంజి, కొండ్రా వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed