నల్లమల అడవిలో తప్పిపోయిన వ్యక్తి.. ముడురోజులైన లభించని ఆచూకీ

by Mahesh |   ( Updated:2024-10-17 11:26:47.0  )
నల్లమల అడవిలో తప్పిపోయిన వ్యక్తి.. ముడురోజులైన లభించని ఆచూకీ
X

దిశ, అచ్చంపేట/అమ్రాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూర్ గ్రామం సమీపంలోని నల్లమల అడవిలో యాదయ్య( 32 )సం అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఈ నెల 15న శ్రీశైలం వెళుతున్నానని, ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరుపల్లి గ్రామానికి చెందిన యాదయ్య కనిపించిన పోవడం పై అమ్రాబాద్ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా యాదయ్యకు సంబంధించి బైకు, బ్యాగు, హెల్మెట్, ఫోన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూరు గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో లభ్యం అయ్యాయి. ఏం జరిగి ఉంటుందో అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 15న శ్రీశైలానికి స్నేహితులతో వెళ్లున్నానని చెప్పి

కనిపించకుండా పోయిన యాదయ్య ఈనెల 15న తన స్నేహితులతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నానని.. తన భార్యకు ఫోన్ ద్వారా చెప్పాడు. మరికొంతసేపటికి నేను ఒక్కడినే శ్రీశైలం వెళుతున్నానని.. తన స్నేహితుడు రావడం లేదంటూ భార్యకు మెసేజ్ పాస్ పెట్టాడు. తదుపరి మరుసటి రోజు నుండి ఈదయ్య ఫోన్ కలవకపోవడం తో భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు మరింత ఆందోళన గురయ్యారు. అమ్రాబాద్ పోలీసుల ద్వారా యాదయ్య కు సంబంధించిన కొన్ని ఆనవాల్లు నల్లమల అడవి ప్రాంతం శ్రీశైలం జాతీయ రహదారి వద్ద పడి ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గురువారం కుటుంబ సభ్యులు బంధువులు హుటాహుటిన మన్ననూరుకు చేరుకొని యాదయ్య కు సంబంధించిన వస్తువులు పడి ఉన్న చోట అడవిలో కొన్ని గంటల పాటు వర్షంలో సైతం గాలింపు చేశారు.

అయినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మరోపక్క భారీగా నల్లమల్ల లో వర్షం కురుస్తూనే ఉంది. గత నాలుగు రోజులు గడుస్తున్న పోలీసు అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. అడవిలో తప్పిపోయిన వ్యక్తి ఏమయ్యాడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదయ్య ఆచూకీ కోసం గ్రామస్తులు, బంధువులు సుమారు 100 మంది గాలింపు చేస్తున్న అటవీ శాఖ పోలీసుల నుంచి సరైన స్పందన లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అడవిలో తప్పిపోయిన యాదయ్య ఆచూకీ వెతికి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రెండు వారాల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఏమయ్యాడు?

నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం ఎర్ర పెంట గ్రామానికి చెందిన శంకర్ అనే చెంచు యువకుడు అటవీ ఉత్పత్తుల సేకరణకై తప్పిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ వ్యక్తి అడవిలో తప్పిపోయి 15 రోజులు గడుస్తున్న అతనికి ఆచూకీ ప్రశ్నార్థకంగా ఉన్నది. శంకర్ కోసం లింగాల పోలీసులు కుటుంబ సభ్యులు రెండు మూడు రోజులు అడవిలో గాలించారు. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో సంఘటన నల్లమల అడవిలో ఈదయ్య అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం అదృశ్యమై దొరకకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పెంపుడు కుక్క తప్పిపోతేనే ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఒక మనిషి అడవిలో తప్పిపోతే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని అధికారులపై స్థానికుల్లో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story