- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Group -1 Aspirants : చిక్కడపల్లి లైబ్రరీ వద్ద హైటెన్షన్.. గ్రూప్-1 అభ్యర్థుల అరెస్ట్ ఉద్రిక్తత
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ పోలీస్ వ్యాన్‌లు, జీపులు భారీ బందోబస్తుతో పోలీసులు ఉన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఏ క్షణం ధర్నాలు, నిరసనలు చేసిన అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు వాతావరణం కన్పిస్తోంది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే, రెండో రోజు కూడా అభ్యర్థులు ధర్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ముషీరాబాద్ గాంధీ నగర్ పార్కులో గ్రూప్ 1 అభ్యర్థులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాయంత్రం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అభ్యర్థులు ధర్నాకు రెడీ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు లైబ్రరీ వద్దకు చేరుకుని నిరసన అడ్డుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పొడవైన భారీ కర్రలతో పోలీసులు లైబ్రరీ వద్ద తిరుగుతున్నారు.