AP News:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

by Jakkula Mamatha |
AP News:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైసీపీ హయాంలో రాష్ట్రం భారీగా నష్టపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామీణ రహదారులు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న(బుధవారం) ఏపీ సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, మరమ్మతులపై చర్చించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు ఉండకూడదన్నారు. ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని రోడ్లలో గుంతలు పూడ్చడానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల పరిస్థితిపై డ్రోన్లతో సర్వే చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.55 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని, మరో రూ.30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి పర్మిషన్‌ వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story