తల్లి చనిపోయిందని.. సెల్ఫీ వీడియో తీసి కొడుకు..

by Sumithra |   ( Updated:2021-05-29 09:20:35.0  )
తల్లి చనిపోయిందని.. సెల్ఫీ వీడియో తీసి కొడుకు..
X

దిశ, జల్‌పల్లి : మా మమ్మీ ఏఐజి ఆసుపత్రిలో ఉంది.. ఉదయం వరకు బాగానే ఉంది.. పొద్దున ఆక్సిజన్ తీసి మా అమ్మను చంపారు.. ఇంకా ఎన్ని రోజులు పెడుతారని.. తీసేసినట్లు చెప్పారు డాక్టర్లు.. ఇప్పుడేమో గుండెపోటుతో చనిపోయిందని చెబుతున్నారు. ఉదయం నుంచి డాక్టర్లతో మాట్లాడడానికి ప్రయత్నించా.. ఎవరూ కలవలేదు. ఈ రోజు కాకున్నా ఇంకా నాలుగైదు రోజులకు అయినా ఇదే అవుతుందని డాక్టర్లు చెబుతున్నారంటే ముందుగానే మా అమ్మను చంపేశారంటూ కన్న తల్లి చనిపోయిన బాధలో ఒక్కగానొక్క కొడుకు.. సెల్ఫీ వీడియా తీసి స్నేహితులకు పోస్ట్ చేసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్ పల్లి మధుబన్ కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ జిల్లా రామచంద్రయ్య, రుక్మిణి(60)లు దంపతులు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు జిల్లా శ్రీహరి(21) బీకాం విద్యార్థి. తల్లి రుక్మిణికి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం గచ్చి‌బౌళిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కరోనా చికిత్స కొనసాగుతుండగా అకస్మాత్తుగా రుక్మిణి శుక్రవారం మృతి చెందింది.

దీంతో కుమారుడు శ్రీహరి ఆసుపత్రి వైద్యులే తన అమ్మను చంపారని ఆరోపిస్తూ సెల్ఫీ తీసుకుని శనివారం ఉదయం జల్‌పల్లిలోని ఉందాసాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో శ్రీహరి మృతదేహాన్ని వెలికితీశారు. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed