మోడీ సర్కారు ఆర్టీఐ చట్టాన్ని చంపేస్తోంది : ఖర్గే

by Vinod kumar |
మోడీ సర్కారు ఆర్టీఐ చట్టాన్ని చంపేస్తోంది : ఖర్గే
X

న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని కొద్దికొద్దిగా చంపేస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆర్టీఐ వెబ్‌సైట్‌ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అదృశ్యమయ్యాయంటూ వస్తున్న నివేదికలపై ఆయన స్పందిస్తూ.. ఇది పైకి కనిపిస్తున్న స్వల్ప విధ్వంసం మాత్రమేనని, ఎవరికీ కనిపించని అంతర్గత విధ్వంసం ఇంకా చాలా ఉంటుందని కామెంట్ చేశారు.

‘ఆర్టీఐ చట్టాన్ని చిదిమేయడం.. దేశ ప్రజల రాజ్యాంగ హక్కులపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో మరో అడుగు’ అని ఖర్గే ట్వీట్ చేశారు. సమాచార రక్షణ చట్టం ముసుగులో ఆర్టీఐ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ అనేది.. సమాచార హక్కుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పిరికి దాడి అని ఆయన విమర్శించారు.

Advertisement

Next Story