6 జిల్లాల్లో భారీ వర్షాలు.. పర్యాటకులను అనుమతించని అధికారులు.. మరోవైపు రైతుల ఆందోళన

by Anjali |
6 జిల్లాల్లో భారీ వర్షాలు.. పర్యాటకులను అనుమతించని అధికారులు.. మరోవైపు రైతుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్రంలో వేసవి తాపం కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రానున్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా నేడు జగిత్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, గద్వాల, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూల్, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని ఏపీఎస్డీఎమ్ఎ ప్రకటించింది. అలాగే తమిళనాడులో ప్రస్తుతం 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. ఓ వైపు ధాన్యం తడుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed