- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి కాని ప్రసాదుల స్పెషల్ పూజలు.. ఓ లిస్ట్‌తో దేవుడికి లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: అమ్మాయిలు సాధారణంగా మంచి భర్త రావాలని మంగళగౌరీ లాంటి ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ, మాకు ఏమీ తక్కువ.. అంటూ తమకు మంచి అమ్మాయి భార్యగా దోరకాలని పెళ్లికాని అబ్బాయిలు పూజలు చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఓ గ్రామంలో 30 ఏళ్లు దాటిన తమకు పెళ్లి కావడం లేదని కొందరు యువకులు తమ ఊరిలోని దేవుడి గుడిలో పూజలు నిర్వహించారు. చిక్కమగళూరు జిల్లాలోని బ్యాడిగెరె గ్రామంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఏటా సుగిజాత్రా పేరుతో ఉత్సవాలు జరుపుతారు.
ఈ ఉత్సవాల్లో గ్రామానికి చెందిన 25 నుంచి 30 ఏళ్ల పైబడి సుమారు 30 మంది పెళ్లి కాని యువకులు ఇంత వయసు వచ్చిన తమకు వివాహం కావడం లేదని, గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. వారి అందరి పేర్లను కాగితాలపై రాసి దేవుని హుండీలో వేయగా, మరో లిస్ట్‌ను పరదేశప్ప మఠానికి పంపించారు. ఇలా చేస్తే ఆ దేవుడు తమ కోరికలను చదివి త్వరగా వాటిని నెరవేరుస్తాడని వారి విశ్వాసం. అయితే ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి కోసం అమ్మాయిలే కాదు.. మంచి జోడి దొరకడం కోసం పెళ్లి కాని ప్రసాదులు కూడా పూజలు చేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.