మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. ఆరుకేసులు నమోదు

by Shamantha N |
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. ఆరుకేసులు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తుంది. పూణేలో ఆరు జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భణీలు ఉన్నారు. అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిన పడినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే మహారాష్ట్రలో తొలికేసు అని పేర్కొంది. ఆ తర్వాత వైద్యుడి 15 ఏళ్ల కుమార్తెకు వైరస్ సోకినట్లు తేలిందని వెల్లడించింది. ఇకపోతే, ముండ్వా ప్రాంతానికి చెందిన ఇద్దరికి రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది. ఇకపోతే, అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణీలకు కూడా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.

అప్రమత్తమైన అధికారులు

జికా వైరస్ కేసులు నమోదవ్వడంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పూణే మున్సిపల్ అధికారులు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ప్రారంభించారు. దోమలు వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, ప్యూమిగేషన్ చర్యలు చేపట్టారు. కాగా వైరస్‌ సోకిన ఎడెస్‌ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు.

Next Story

Most Viewed