నీ అందాలు చూడతరమా.. రెడ్ డ్రెస్‌లో దోర జామపండులా లైగర్ బ్యూటీ

by Jakkula Samataha |
నీ అందాలు చూడతరమా.. రెడ్ డ్రెస్‌లో దోర జామపండులా లైగర్ బ్యూటీ
X

దిశ, సినిమా : లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాంత్రం హై రేంజ్‌లో ఉంది.

ఇక అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించాలని అనుకుంది. కానీ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా తన హాట్ హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.అందాల బాణాలు విసిరేస్తూ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. లేలేత అందాలను చూపిస్తూ.. ఎర్రటి డ్రెస్‌లో దోర జామ పండులా కనిపిస్తున్న ఈ బ్యూటీ అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. పొట్టి గౌనులో , కొంటెగా చూస్తూ.. హాట్ హాట్ ఫోజులతో యూత్‌కు మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story