- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యూరో కప్‌లో సెమీస్‌కు ఫ్రాన్స్, ఇంగ్లాండ్
దిశ, స్పోర్ట్స్ : యూరో కప్‌లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ సెమీస్‌కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొందాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు పెనాల్టీ షూటౌట్లోనే తేలాయి. మొదట పోర్చుగల్, ఫ్రాన్స్ జట్ల మధ్య మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఒక్క గోల్ కూడా నమోదవ్వకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అక్కడ దూకుడుగా ఆడిన ఫ్రాన్స్ 5-3 తేడాతో పోర్చుగల్‌పై విజయం సాధించింది. దీంతో క్రిస్టియానో రొనాల్డో తన చివరి యూరో కప్‌లో పోర్చుగల్‌కు టైటిల్ అందించాలన్న కల నెరవేరలేదు. దీంతో మ్యాచ్ అనంతరం అతను ఎమోషనల్ అయ్యాడు.
ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్ తరపున బ్రీల్ ఎంబోలో 75వ నిమిషంలో గోల్ చేయగా.. ఇంగ్లాండ్ ఆటగాడు బుకాయో సకా 80వ నిమిషంలో గోల్ చేసి మ్యాచ్‌ను పెనాల్టీ కార్నర్‌కు మళ్లించాడు. అక్కడ ఇంగ్లాండ్ 5-3 తేడాతో నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడగా.. నెదర్లాండ్స్ లేదా తుర్కియేతో ఇంగ్లాండ్ ఆడనుంది.