- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి’.. ప్రభుత్వం పై వరుదు కళ్యాణి ఫైర్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రోజు రోజుకూ మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి చేసిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పుంగనూరు ఘటన జరిగినప్పుడు పవన్ కల్యాణ్ అదే జిల్లాలోని తిరుపతిలో ఉన్నారని గుర్తుచేశారు.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించారు. ఆడపిల్లల మీద మీకు ఉన్న బాధ్యత ఇదేనా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మహిళలు శవాలై తేలుతున్నారని ఆమె ఆరోపించారు. పుంగనూరులో అంజూమ్ అనే బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంతవరకు దోషులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. సీఎం ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ కూడా మహిళలకు లేదా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు.