హైడ్రా ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్ ఆమోదం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-05 10:43:38.0  )
హైడ్రా ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా ఆర్డినెన్స్‌(Hydra Ordinance)కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తక్షణం అమల్లోకి వచ్చింది. హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ విపక్షాల నేతలు విమర్శలు చేస్తుండడం, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడం విశేషం.

ఇప్పటికే కూల్చివేతలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జరిగిన విచారణల్లో వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనున్నందున ఆర్డినెన్సు విషయమై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వివరించే అవకాశమున్నది. ఈ సమయంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో గెజిట్‌ విడుదలైన తేదీ నుంచే హైడ్రా ఉనికిలో ఉన్నట్లయింది.

Advertisement

Next Story